Saturday, May 18, 2024

తెరచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం… ప్రత్యేక రైళ్ల వివరాలివే..!!

spot_img

గురువారం సాయంత్రం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మండల పూజ సీజన్ షూరు కావడంతో ఆలయాన్ని తెరిచారు. రెండు నెలలపాటు భక్తులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సారి అయ్యప్ప ఆలయాన్ని భక్తులకు సరికొత్తగా కనువిందు చేయనుంది. ఆలయం ప్రవేశద్వారం దగ్గర కొత్త రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఈ శిలలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ శిలలపై చక్కటి కళాకృతులు భక్తులను కట్టిపడేస్తున్నాయి. ఆ రాతి శిలలపై స్వామియే శరణం అయ్యప్ప అని రాశారు.

ఆలయ ప్రవేశం వద్ద హైడ్రాలిక్ రూఫ్ ను హైదరాబాద్ కు చెందిన విశ్వ సముద్ర అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. చెన్నై కిచెందిన క్యాపిటల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ దీన్ని తయారు చేసింది. ఆలయంలోని 18 బంారు మెట్లు ఉండే పదినిట్టం పాడిపై ఈ రూఫ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా అత్యాధునికమైన టెక్నాలజీతో రూపొందించారు. వర్షం లేని సమయంలోఆ రూఫ్ మడత పెట్టి పక్కన పెట్టవచ్చు.

డిసెంబ్ 27న మండల దీక్ష సీజన్ ముగుస్తుంది. అప్పుడు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మకరక సంక్రామణ రోజైన డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత జనవరి 15న అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటారు.

శబరిమలకు వెళ్లి, వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. 4 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

నవంబర్ 19న సికింద్రాబాద్ – కొల్లం ప్రత్యేక రైలు (07121)

నవంబర్ 19న నర్సాపూర్ – కొట్టాయం ప్రత్యేక రైలు (07119)

డిసెంబర్ 20న కొట్టాయం – నర్సాపూర్ ప్రత్యేక రైలు (07120)

డిసెంబర్ 21న కొల్లం – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07122)

ఇది కూడా చదవండి : పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ పోస్టర్లు

Latest News

More Articles