Friday, May 17, 2024

92 ఏండ్లలో ఇదే తొలిసారి.. యశస్వి, రాహుల్, జడేజా సెంచరీలు మిస్‌

spot_img

హైదరాబాద్: ఉప్పల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలను మిస్ చేసుకున్నారు. ఇలా 92 ఏండ్లలో(1932లో ఇంగ్లండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడింది)  ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, స్టార్‌ బ్యాటర్‌ కెఎల్‌ రాహుల్, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాలు 80లలో ఔట్‌ అయి శతకాలు చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.

Also Read.. అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

14 పరుగుల తేడాతో రాహుల్‌, జడేజాలు సెంచరీ మిస్ చేసుకున్నారు. జైస్వాల్‌ 74 బంతులలో 10 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్‌ 123 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 86 రన్స్‌ చేసాడు. జడేజా 180 బంతులలో 7 బౌండరీలు, 2 సిక్సర్లతో 87 రన్స్‌ చేశాడు. మరోవైపు బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 436 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది.

 

Latest News

More Articles