Friday, May 17, 2024

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..!

spot_img

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం రాగి జావ అందించాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇటీవల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్పాహార పథకం ప్రారంభించడంతో ఇక విద్యార్థులు రోజూ పాఠశాల నుండి బయలుదేరే ముందు రాగి జావను అందించాలని నిర్ణయించడం జరిగిందని ఒక అధికారి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహార సప్లిమెంట్‌గా రాగి జావను పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే.. బెల్లం పొడితో కలిపిన ఈ సప్లిమెంట్ జావను వారానికి మూడుసార్లు ఉదయం వేళలో అందించేవారు. అయితే ఇకపై రోజూ స్కూల్ ముగిసే ముందు రాగి జావను అందించాలని సర్కారు నిర్ణయించినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

Latest News

More Articles