Saturday, May 18, 2024

8 ఏండ్లలో 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన తెలంగాణ

spot_img

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ కల్పనలో దూసుకుపోతోంది. గత 8 ఏండ్లలో 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించింది. అంతేకాకుండా.. ప్రైవేటు రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి యువతకు చేయూతగా నిలిచింది.
కాగా.. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలను ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం.. ఆ లెక్కన ఇప్పటివరకూ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ, గడిచిన 8 ఏండ్లలో బీజేపీ సర్కారు 6.9 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు హామీలు నీటి బుడగలేనని తేటతెల్లమైంది. 40 ఏండ్లలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నా.. బీజేపీ సర్కారు మాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టట్లేదు. ఫలితంగా, దేశంలోని మొత్తం శ్రామిక శక్తి 85 కోట్లుగా ఉంటే, అందులో 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారు.

Latest News

More Articles