Friday, May 10, 2024

పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసిని ఉన్మాది

spot_img

హనుమకొండ జిల్లాలో కాజీపేటలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యవతిని గొంతుకోశాడు. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కొంతకాలంగా వాళ్లు ప్రేమించుకుంటున్నారు. అమ్మాయిది వేరే మతం కావటంతో శ్రీనివాస్ కూడా మతం మార్చుకున్నాడు. కానీ పెళ్లికి మాత్రం అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన శ్రీనివాస్ అమ్మాయి గొంతుకోశాడు. అడ్డుకున్న యువతి కుటుంబ సభ్యులపై కూడా అతను దాడి చేశాడు. దాడి తీవ్రంగా గాయపడిన యువతిని వరంగల్ లోని  ఎంజీఎం కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles