Saturday, May 11, 2024

పిల్లలు పుట్టని దంపతులకు ప్రభుత్వం శుభవార్త

spot_img

సంతానం లేని దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప శుభవార్తనందించింది. సంతానం లేని జంటల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) సెంటర్‌ను ప్రారంభించింది. ఆదివారం గాంధీ ఆసుపత్రిలో సంతానం లేని జంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మొట్టమొదటి IVF సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వానికి ఇది ఒక కీలక మలుపు కానుంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఐవీఎఫ్ క్లినిక్, సంతానం లేని దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను సాకారం చేసేందుకు పూర్తి స్థాయి విధానాలను అందిస్తుంది. గాంధీ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఈ కేంద్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు పాల్గొన్నారు.

ఇది రెండు ఆపరేషన్ థియేటర్లు, పిండం, ఆండ్రాలజీ లేబొరేటరీలను కలిగి ఉంది. సెంటర్‌లో ట్రైనాల్క్యులర్ స్టీరియో జూమ్ మైక్రోస్కోప్, ఇన్‌వర్టెడ్ మైక్రోస్కోప్‌తో కూడిన ICSI మైక్రోమానిప్యులేటర్ సిస్టమ్, IVF వర్క్‌స్టేషన్లు, IVF లేజర్ సిస్టమ్‌తో పాటు అల్ట్రాసౌండ్ స్కానర్‌లు ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో మరో రెండు ఐవిఎఫ్ క్లినిక్‌లను పేట్లబుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రిలో రానున్న కొద్ది నెలల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో, పునరుత్పత్తి వయస్సులో 15శాతం జంటలకు పిల్లలు పుట్టడం కష్టంగా మారిందని చాలా అధ్యయనాలు సూచించాయని వారు చెప్పారు.

Latest News

More Articles