Sunday, April 28, 2024

తెలంగాణలో మొదలైన ఎన్నికల కోడ్.. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్‎పోస్టులు

spot_img

త్వరలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‎ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్‎గడ్‎లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మూడు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్న తెలంగాణలో 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 948 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: ఎలక్షన్ షెడ్యూల్ మీద కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించింది. తెలంగాణలో అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. తెలంగాణలో 119 స్థానాలు, మధ్యప్రదేశ్ 230 స్థానాలు, మిజోరాం 40 స్థానాలు, ఛత్తీస్ గడ్ 90 స్థానాలు, రాజస్థాన్ 200 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికల కసరత్తు పూర్తిచేయనున్నారు.

Read Also: భార్య కాపురానికి రావట్లేదని కరపత్రాలలో ఏం రాసి పంచాడో తెలుసా?

రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది. కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది.

Read Also: మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ నుంచి రిజల్ట్ వరకు ఫుల్ డిటైల్స్

Latest News

More Articles