Friday, May 3, 2024

నేటి నుంచి టెన్త్ పరీక్షలు..5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే..!

spot_img

నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ ట్రైం ఇచ్చారు. అంటే విద్యార్ధులు ఉదయం 9.35గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. విద్యార్ధులు సాధ్యమైనంత వరకు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేవారికి ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే ఛాన్స్ కల్పించింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.

ఇక జవాబు త్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మొత్తంగా 9 రోజులపాటు స్పాట్ వాల్యుయేషన్ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 23న వాల్యుయేషన్ సిబ్బందికి ఓరియంటేషన్ ను నిర్వహిస్తామన్నారు. 11పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించడంతో జవాబు పత్రాల సంఖ్య తగ్గుతుంది. దీంతో మూల్యాంకనాన్ని త్వరగా పూర్తి చేసి, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: WPL టైటిల్ ఆర్సీబీదే..ఫైనల్లో చిత్తుగా ఓడిన ఢిల్లీ.!

Latest News

More Articles