Sunday, May 19, 2024

అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఇదే..!!

spot_img

Ram Mandir: అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రతిష్టించిన బలరాముడి విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ రామయ్య దివ్యరూపాన్ని చూసిన భక్తులు భక్తిపారవశంతో పులకించిపోతున్నారు.

అయోధ్యలో రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. అంతేకాదు ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారుచేసిన ముహుర్తానికి సమయం దగ్గరపడుతున్నాయి. దీంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్య ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి చేరుకుంది. ఆ భవ్యరాముడికి చెందిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

శ్యామల్’ (black) రాతితో చేసిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) రూపొందించారు. యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న ఐదేళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం, హాలో కారణంగా, విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుందని, భూమి నుండి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు ఏడు అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.

ఇక గురువారం రామయ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా సాగింది. వేదమంత్రోచ్చరణల మధ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 4గంటలపాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత రాములవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎస్‌ఎస్‌సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

Latest News

More Articles