Friday, May 17, 2024

పేటీఎంను చుట్టుముట్టిన కష్టాలు..అసలేం జరిగింది.?

spot_img

పేటీఎలం కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పీటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ 2024 ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. అప్పటి నుంచి వినియోగదారుల ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్, వాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్ లు, ఎన్ సీఎంసీ కార్డులు తోపాటు క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్ లు కూడా అప్పటి నుంచి చేయకూడదని ఆర్బీఐ తెలిపింది. పీపపీబీఎల్ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్ చేసిన రిపోర్టు ఆధారంగానే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించడం, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్ లో తేలడంతోనే సంస్థపై ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని ఆర్బీఐ వెల్లడించింది.

పేటీఎంపై ఆరోపణలు ఇవీ:
పేటీఎంపేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు,కేవైసీ ఉల్లంఘనలు దీనికి కారణమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంక్ మధ్య భారీ మోసం జరిగినట్లు తెలుస్తోంది.  అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగే అవకాశమూ కూడా ఉంది.

-పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలను గుర్తించారని సమాచారం. ఒక పాన్ తో వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయట. కేవైసీ చేసిన ఖాతాలను నిర్దేశించిన గరిష్ట పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు 35కోట్ల ఇ వాలెట్స్ ఉండగా అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నాయట. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్ తక్కువ మొత్తాలను లిగి ఉన్నాయి. వీటిన్నింటిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కనీసం పాలనలోనైనా నిజాయితీగా ఉండండి

Latest News

More Articles