Sunday, May 19, 2024

శబరిమలకు వెళ్లే అయ్యప్పలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు

spot_img

అయ్యప్పస్వామి భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శబరిమలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 5వ తేదీ నుంచి బస్సు సర్వీస్‌లు ప్రారంభమవుతాయని తెలిపింది. టిక్కెట్ ధరను రూ.13,600గా నిర్ణయించింది.

 శబరిమలకు వెళ్లే బస్సు షెడ్యూల్..

..మొదటి రోజు సాయంత్రం 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
..రెండో రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కాణిపాకం చేరుకొని.. తిరిగి రాత్రి 10.40 గంటలకు బయలుదేరుతుంది.
..మూడో రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
..నాలుగో రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమలై చేరుకొని.. తిరిగి మరుసటి రోజు ఉదయం 8.20 బయలుదేరుతుంది.
ఉదయం 9.20 గంటలకు పంబకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు బస్సు తిరిగి బయలుదేరుతుంది.
..ఐదో రోజున ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకొని… ఉదయం గం.9.20 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
..ఆరో రోజున ఉదయం ఏడున్నర గంటలకు అరుణాచలం చేరుకొని… తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మధురై చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.20 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత కంచికి వెళ్తుంది.
..ఏడో రోజున ఉదయం 11.10 గంటలకు మహానంది చేరుకుంటుంది. రాత్రి 11.30 తిరిగి అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులుకు గుడ్ న్యూస్

Latest News

More Articles