Saturday, May 18, 2024

రూ.5వేలకోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్‌

spot_img

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు టీటీడీ బోర్డ్ సభ్యులు ఆమోదించారు. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు, హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు కేటాయించారు. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, పలు వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు, పారిశుధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా- భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు కేటాయించారు.

ఆదాయం అంచనాలో శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు, ఫిక్స్ డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల అమ్మకాల ద్వారా రూ.448 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

అంతేకాదు.. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ బోర్డు సభ్యులు. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు పాలకమండలి చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని వివరించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం

Latest News

More Articles