Saturday, May 11, 2024

కొండపై భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

spot_img

హైదరాబాద్‌: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. SSD టోకెన్లు లేని సర్వదర్శనం భక్తుల దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది.

జూన్‌ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో  టీటీడీ మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసింది. అలాగే గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేసమయంలో స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపింది. ఇలా చేయడం ద్వారా 4 గంటలు ఆదా అవుతుందని టీటీడీ వెల్లడించింది.

Latest News

More Articles