Monday, May 20, 2024

అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లక్ష లడ్డులు

spot_img

జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం ఆభరణాలు, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరుతున్నాయి. తాజాగా తిరుపతి నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీవారి లడ్డులు చేరాయి. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు.

Read Also: మా పార్టీని ఎందుకు బొందపెడ్తవ్? తెలంగాణ తెచ్చినందుకా… డెవలప్ చేసినందుకా?

అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలిని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లక్ష లడ్డూలను తయారు చేసి.. నిన్న ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి పంపించారు. వీటినే 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలను ఏరో గ్రూప్ సహాయంతో చాపర్ ద్వారా అయోధ్యకు పంపించినట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

Latest News

More Articles