Wednesday, May 8, 2024

ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజాపక్షమే

spot_img

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు తెలంగాణ భవన్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో బీఆర్ఎస్ కు ఏ రోజు పొత్తు లేదు. భవిష్యత్తులోనూ ఉండదు. సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 5 ఏండ్లలో ఏం చేసిండో చెప్పాలి. కెసిఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని. బీఅర్ఎస్ కెసిఅర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక బీజేపీ చేతులెత్తేసింది. శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు

కేసీఆర్ గారి నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో బిజెపిని అడ్డుకున్నది ముమ్మాటికి టిఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ వల్లనే బిజెపి సీనియర్ నాయకులు హైదరాబాద్ పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షమే. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు.. మహిళలకు ఇచ్చిన 2500 రావడం లేదు.. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతాం.

Latest News

More Articles