Saturday, May 4, 2024

చ‌రిత్ర సృష్టించిన ఉగాండా

spot_img

ఆఫ్రికా దేశం ఉగాండా చరిత్ర సృష్టించింది. వ‌చ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదిక‌గా జ‌ర‌గాల్సి ఉన్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు అర్హ‌త సాధించింది. ఐసీసీ మెగా టోర్నీలో ఉగాండా ఆడ‌నుండ‌టం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆఫ్రిక‌న్ రీజియ‌న్ క్వాలిఫ‌య‌ర్స్‌లో న‌మీబియా ఆడిన ఐదు మ్యాచ్‌ల‌లో ఐదింటిని గెలుచుకుని ప‌ది పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఉగాండా జ‌ట్టు ఆరు మ్యాచ్‌ల‌లో ఏకంగా ఐదు గెలిచి ప‌ది పాయింట్ల‌తో రెండో స్థాన‌లో నిలిచి క్వాలిఫై అయ్యాయి.

ఉగాండా – రువాండాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా, 18.5 ఓవ‌ర్ల‌లో 65 ప‌రుగులకు ఆలౌట్ అయింది. అనంత‌రం ఉగాండా.. 8.1 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. న‌మీబియా, ఉగాండాలు క్వాలిఫై కాగా.. జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్ర‌మించాయి.

ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు:

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెద‌ర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక‌, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌, కెనడా (అమెరికా క్వాలిఫ‌య‌ర్‌), నేపాల్‌, ఓమ‌న్ (ఆసియా క్వాలిఫ‌య‌ర్‌), ప‌పువా న్యూ గినియా ((ఈస్ట్ ఆసియా ప‌స్‌పిక్), ఐర్లాండ్‌, స్కాట్లాండ్ (యూర‌ప్ క్వాలిఫ‌య‌ర్‌), న‌మీబియా, ఉగాండా (ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్‌) జ‌ట్లు అర్హ‌త సాధించాయి. ఆతిథ్య హోదాలో విండీస్, అమెరికాలు ఆడ‌నున్నాయి.

Latest News

More Articles