Sunday, May 19, 2024

హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు

spot_img

ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలనుకుంటున్న వారికి ఆ దేశం పెద్ద షాక్‌ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే మొదటి సారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమెరికన్‌ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్‌ కంపెనీలు భారత్‌, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్‌-1బీ వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్‌-1బీ వీసా అప్లికేషన్‌ ఫీజును ఏప్రిల్‌ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి ఇది నీకు సిగ్గుచేటు.. మల్లారెడ్డి సీరియస్..!

Latest News

More Articles