Sunday, May 19, 2024

తెలంగాణలో రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారా..?

spot_img

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను రద్దు చేస్తుంది. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్త ఇది. ప్రభుత్వ పెద్దలు చేయాలనుకున్న పనులను ముందు లీకుల రూపంలో ఇచ్చి పని కానిచ్చేయటం అనేది సాధారణం. అలానే కాంగ్రెస్ పెద్దలు కూడా తెల్లరేషన్ కార్డుల రద్దు వార్తని ముందుగా లీక్ చేసి ప్రజల పల్స్ తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేషన్‌ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే.. ఇది నిజమేనా అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. ఆ పోస్టుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ట్యాగ్‌ చేశారు.

దీంతో ఉత్తమ్‌ అదే సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్కరేషన్‌ కార్డును కూడా తొలగించలేదని.. అదంతా ఫేక్‌ న్యూస్‌ అంటూ కొట్టిపారేశారు. రేషన్ కార్డులను రద్దు చేశారా.. అంటూ అసద్ ట్వీట్ చేయగా.. ఉత్తమ్ రీట్విట్ చేస్తూ.. అసద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. మా ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రేషన్ కార్డును రద్దు చేయలేదు.. అంటూ ఆయనకు ట్యాగ్ చేశారు. అయితే ఉత్తమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఇంకా అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయని.. ముఖ్యమంత్రి స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ రాదంటున్నారు నెటిజన్స్.

Latest News

More Articles