Friday, May 17, 2024

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..!!

spot_img

రాష్ట్రవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి కొలువుదీరిన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తూప్రాన్ జిల్లా వర్గల్లో భక్తుల సందడి నెలకొంది. అక్షరభ్యాసలు చేయిస్తున్నారు.

అటు నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇవాళ ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామునే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే క్యూలైన్లో నిలబడి ఉన్నారు. తెల్లవారుజామును నుంచి అక్షర శ్రీకార పూజలు షురూఅయ్యాయి. కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

ఇది కూడా చదవండి: అమెరికాలో బుబోనిక్ ప్లేగు తొలికేసు నమోదు..!!

Latest News

More Articles