Sunday, May 19, 2024

బిల్లులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఉపసర్పంచ్ ఆత్మహత్యాయత్నం

spot_img

గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాకుండా అడ్డుకోవడంతో.. ఓ గ్రామ ఉప సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. నవాబ్ పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన దామోదర్ ఆ గ్రామ ఉప సర్పంచ్‎గా ఉన్నాడు. ఆయన గత ప్రభుత్వ సమయంలో గ్రామంలో డ్రైనేజీ పనులను చేయించాడు. వాటికి సంబంధించిన బిల్లుల విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే తమ్ముడు దుష్యంత్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు తన బిల్లులు ఆపుతున్నారని దామోదర్ ఆరోపిస్తున్నాడు. వారి వేధింపులు తట్టుకోలేక దామోదర్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దామోదర్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆస్పత్రికి వెళ్లి దామోదర్‎ను పరామర్శించారు. బిల్లుల ఆలస్యం వెనుక కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆలస్యం అయిందని ఏఈ రాములు స్పష్టం చేయడం గమనార్హం.

Read Also: ఫార్ములా -ఈ రేస్ రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయం

Latest News

More Articles