Tuesday, May 21, 2024

గాలికి కొట్టుకుపోయిన విమానం.. వైరల్ వీడియో

spot_img

అర్జెంటీనాను అతలాకుతలం చేస్తున్న తుఫాను కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ గాలుల బారి నుంచి విమానాలు సైతం తప్పించుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న ఓ విమానం బలమైన గాలులు వీయడంతో 90 డిగ్రీల మలుపు తిరిగి పక్కనున్న స్టెప్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జ్ న్యూబెరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

Read Also: వితంతువులకు ముత్తూట్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్

బలమైన గాలులు రావడంతో సిబ్బంది విమానాలను ఎయిర్ పోర్టులో నిలిపి ఉంచారు. కానీ, ఒక్కసారిగా గాలులు తీవ్రత పెరగడంతో ఆ విమానం ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో విమానం పాక్షికంగా దెబ్బతిన్నట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జెంటీనాలో తీవ్రమైన తుఫాన్ కారణంగా 16 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ తుఫాన్ మొదటి సారిగా డిసెంబర్ 16న బ్యూనస్ ఎయిర్స్‌కు దక్షిణంగా 570 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓడరేవు నగరం బహియా బ్లాంకాలో ల్యాండ్‌ ఫాల్ చేసింది.

Latest News

More Articles