Saturday, May 18, 2024

అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం.. జీవితాంతం పోరాడిన వ్యక్తి ఎందుకు రావట్లేదు ?

spot_img

జీవితమంతా రాముడి సేవే. అధిక భాగం అయోధ్య రాముడి కోసమే పోరాటం. ఎలాగైనా అయోధ్యలో రామ మందిరం కట్టాలన్నది అద్వానీ జీవిత లక్ష్యం. అయితే అద్వానీ జీవిత చరమాంకంలో తన చిరకాల స్వప్నం నిజమైంది. ఆయన కలలు కన్న రామమందిర నిర్మణ ఘట్టం రానేవచ్చెసింది. కానీ అద్వానీ మాత్రం అయోధ్య వేడుకలకు రావటం లేదు. కళ్లారా చూసి తరించాల్సిన ఘట్టాన్ని చూడలేకపోతున్నారు. ఈరోజు అయోధ్యలో జరిగే వేడుకలకు అద్వానీ రావటం లేదని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. మురళీ మనోహర్ జోషి కూడా హాజరవడం సందేహమేనని తెలిపాయి.

ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే నేడు అత్యంత ఘనంగా రామమందిర నిర్మాణం మొదలైంది. దేశ విదేశాల నుండి టాప్ సెలబ్రెటీలు ఈ వేడుకలకి హాజరవుతున్నారు. రజినీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, సుమన్ వంటి సినీ తారలు ఇప్పటికే అయోధ్యకి చేరుకున్నారు. అతిధుల కోసం రామ మందిర ట్రస్టు వారు మొత్తం 15 వేల బాక్సులకు ఆర్డర్ చేశారు. మొత్తం 200 మంది సిబ్బంది..5 వేల కేజీల ముడి పదార్థాలతో ప్రసాదం సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

 

Latest News

More Articles