Saturday, May 18, 2024

వరంగల్ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

spot_img

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ఓ రేంజ్‌లో ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ బస్సులన్ని మహిళలతో కిటకిటలాడుతున్నాయి కాదు కాదు కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కాదు కదా.. కనీసం నిలబడేందుకు కూడా చోటు దొరకట్లేదని మగవాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆదరణ విషయం పక్కకుపెడితే.. గొడవలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. ఏకంగా.. మహిళామణులు సిగపట్లు పట్టుకునేంతగా కొట్లాటలు అవుతున్నాయి.

తాజాగా వరంగల్ బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. అయితే.. బస్సు రాగానే పాత అలవాటు ప్రకారం.. కిటీకీల్లోంటి జేబు రుమాళ్లు, బ్యాగులు వేసి సీట్లు ఆపుకున్నారు. అందులో భాగంగా ఓ మహిళ కూడా తనవంతుకు ఓ సీటు ఆపుకుంది. అయితే.. తాను బస్సు ఎక్కి వచ్చి.. తాను ఆపుకున్న సీట్లో కూర్చుందామని చూస్తే అందులో అప్పటికే మరో మహిళ కూర్చొని కనిపించింది. ఇంకేముంది.. గొడవ మొదలైంది. నేనంటే నేను ముందుగా సీటు ఆపుకున్నానంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.

Read Also: మంత్రులు కూర్చున్నరు.. సర్పంచ్‎ను నిలబెట్టిండ్రు

ఈ గొడవలో బూతులు కూడా చేరటంతో.. మరింత తీవ్రంగా మారింది. ఇద్దరు మహిళలు కోపావేశానికి లోనై ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మిగతా ప్రయాణికులు ఎంత ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా.. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ.. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వీళ్లిద్దరి మధ్య గొడవను చూసి.. మిగతా ప్రయాణికులంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే.. ఈ తతంగాన్నంతా బస్సులోనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

Latest News

More Articles