Saturday, May 18, 2024

ఏసీబీకి చిక్కిన యాదాద్రి భువనగిరి డీటీఓ

spot_img

యాదాద్రి భువనగిరి: 5 వేల రూపాయలు లంచంతీ సుకుంటూ యాదాద్రి భువనగిరి రవాణా శాఖ అధికారి సురేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరు ఏజెంట్లను ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read.. కాళేశ్వరంపై విచారణ చేసుకోండి.. కానీ రైతులను ఆదుకోండి  

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ)గా సురేందర్‌రెడ్డి.. నేషనల్‌ పర్మిట్‌ క్యాన్సిల్‌ కోసం భూదాన్‌పోచంపల్లి మండలానికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.

Also Read.. యెమెన్‌పై అమెరికా దాడులు.. ఎర్రసముద్రంలో ఉద్రిక్తత!

డీటీఓతోపాటు ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్‌ చేసిన అధికారులు వారిని హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మల్లికార్జున్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీబీ నల్లగొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Latest News

More Articles