న్యూఢిల్లీ: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్, ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు రవిశంకర్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, దర్శకుడు రాజమౌళి (ఆర్ఆర్ఆర్), నిర్మాత అభిషేక్ అగర్వాల్ (ది కశ్మీర్ ఫైల్స్) తదితరలు అవార్డులు స్వీకరించనున్నారు.
Also Read.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి
కాగా, ఈ వేడుక ప్రారంభానికి కొన్ని క్షణాల ముందు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నేషనల్ అవార్డు అందుకోబోతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. కమర్షియల్ చిత్రానికి (పుష్ప: ది రైజ్) జాతీయ అవార్డురావడమనేది డబుల్ అఛీవ్మెంట్ అని పేర్కొన్నారు. అనంతరం ‘పుష్ప’లోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
NATIONAL AWARD WINNING BEST ACTOR Icon Star @alluarjun shares his excitement ahead of the Presentation Ceremony of '69th National Film Awards' ❤️🔥❤️🔥#Pushpa @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/lMXf77JrWL
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2023