ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 69వ నేషనల్ అవార్డుల వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా హీరో అల్లు అర్జున్ అందుకున్నాడు. పుష్ప సినిమాలో ఆయన చేసిన నటనకు నేషనల్ అవార్డు దక్కింది. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఇప్పటివరకు మహామహులే సాధించలేని అరుదైన ఘనతను అల్లు అర్జున్ సాధించి సంచలనం సృష్టించాడు.
ఇది కూడా చదవండి: ఎన్నికల పాటల సీడీని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు