Saturday, May 18, 2024

ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు

spot_img

ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు. ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయో వారికి ఓటు వేయాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(సోమవారం) మాల్యాలలో మహబూబాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌తో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. శంకర్ నాయక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్ పుణ్యమా భూములు భద్రంగా వున్నాయి

కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు సాగు, తాగు నీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డామన్నారు  మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేసారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు రైతు బీమా సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చే మూడు గంటల విద్యుత్ కావాలా? కేసీఆర్ అందించే 24 గంటల విద్యుత్ కావాలో తేల్చుకోవాల్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, కాంగ్రెస్ ఓటు వేసిన కర్ణాటక ప్రజల పరిస్థితి ఉందన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు 7 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటకమని తేలిందన్నారు మంత్రి సత్యవతి. మల్యాలలో హార్టీ కల్చర్ డిగ్రీ కాలేజీని ప్రారంభించుకున్నాం. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటేసి శంకర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

ఇది కూడా చదవండి: డిసెంబర్ 6వ తేదీ నుండి రైతు బందు యధావిధిగా వస్తది

Latest News

More Articles