Saturday, May 18, 2024

చిల్లరతో ఐ ఫోన్‌ కొన్న బిచ్చగాడు

spot_img

ఐ ఫోన్‌ కొత్త మోడల్ వచ్చిదంటే చాలు దానిని కొనడానికి సామాన్యుల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్‌ కొనడానికి వెళ్తే.. షాప్‌ నిర్వాహకులు లోపలికి రానిస్తారా? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ‘ఎక్స్‌పెరిమెంట్‌ కింగ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు ఓ ప్రయోగం చేశారు.

Also Read.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం

వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్‌ షోరూంల దగ్గరకు పోయాడు. కొందరు లోపలికి రానివ్వలేదు. మరికొందరు చిల్లర తీసుకోవడానికి నో చెప్పారు. చివరగా ఓ షాపు యజమాని చిల్లర తీసుకొని ఐ ఫోన్‌ ప్రో మ్యాక్స్‌ అందజేసేందుకు ఒప్పుకున్నాడు.

Also Read.. రాత్రికి రాత్రే గాజాపై బాంబులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్‌ అని చెప్పడంతో షాపు యజమాని ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారింది. బిచ్చగాడు ఐ ఫోన్‌ కొనడమేంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోగా.. మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Latest News

More Articles