Sunday, May 5, 2024

బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్‌

spot_img

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ముందుగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read.. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ ఖాయం

ఓపెనర్‌లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలాన్‌ ఇద్దరు కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో షకీబ్‌ ఉల్ హసన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో 52( 8 ఫోర్‌లు) క్లీన్‌ బౌల్డయ్యాడు. తర్వాత జోయ్‌ రూట్‌ వన్‌ డౌన్‌గా వచ్చి డేవిడ్‌ మలాన్‌కు జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో సెంచరీ హీరో డేవిడ్‌ మలాన్‌ 140( 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌల్డ్‌ అయ్యాడు.

Also Read.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం

అనంతరం ఇంగ్లండ్‌ బ్యాటర్‌లు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. జోయ్‌ రూట్‌ 68( 8 ఫోర్‌లు, 1 సిక్సర్‌) నాలుగో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. షొరీఫుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి రూట్‌ ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్‌లలో మెహదీ హసన్‌ 4 వికెట్లు, షొరీఫుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశారు.

Latest News

More Articles