Saturday, May 4, 2024

జోకర్‎ని నాయకున్ని చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే

spot_img

మణిపూర్ 100 రోజుల నుండి రగిలిపోతుంటే పార్లమెంటులో నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్యల మీద స్పందించలేదని ప్రముఖ నటుడు, సామాజకి కార్యకర్త ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డారు. 10 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగితే.. వాటిలో రాజకీయం తప్ప.. ప్రజల సమస్యల మీద చర్చించలేదని అన్నారు. జోకర్‎ని నాయకున్ని చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే అని పరోక్షంగా మోడీని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‎లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఆయన ప్రారంభించారు. కవులు, రచయితలతో కలిసి ‘సమూహ’ లోగోను ఆవిష్కరించారు. ‘లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం రచయితలు అందరూ సంఘటితమైనదే ఈ సమూహా. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలందరి ఉమ్మడి స్వరమే ఈ సమూహ. సహనశీలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక ఈ సమూహా’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గుతాయి కానీ, దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గవు. ప్రస్తుతం మనం, మనదేశం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరికే కూర్చోలేను. 100 రోజుల నుండి మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంటులో నువ్వా నేనా అన్నట్లు ప్రవర్తించారు. రాజకీయం తప్ప సమస్యల మీద స్పందన లేదు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయం తప్ప.. ప్రజల సమస్యలు చర్చించలేదు. జోకర్‎ని నాయకున్ని చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే. మనలో ఐక్యత లేదు, మనలో మార్పు రావాలి. ఎక్కడ తప్పు జరిగింది అని 70 ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యాం’ అని ఆయన అన్నారు.

Latest News

More Articles