Saturday, May 4, 2024

కరీంనగర్ రోడ్లపై ఎలుగుబంటి..

spot_img

కరీంనగర్ పట్టణంలో ఓ ఎలుగుబంటి శుక్రవారం రాత్రి నుంచి హల్చల్ చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. రోడ్లపైకి వచ్చిన ఎలుగు.. నగరవాసులను పరుగులు పెట్టిస్తోంది. నిన్న రాత్రి నగర శివారులోని రజ్వి చమన్ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించింది. అనంతరం తెల్లవారుజామున రేకుర్తిలో హల్చల్ చేసింది. ఇండ్ల మధ్యకు వచ్చి అందరినీ భయపెట్టింది. సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రేకుర్తిలో ఎలుగుబంటిని రౌండప్ చేశారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

More Articles