Monday, May 20, 2024

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు.  ఆ తర్వాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుని ..నూతన పోలీస్ కమిషనర్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఉన్న క్రైమ్స్ డీసీపీ దాసరి మురళీధర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.

2009 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా 2011 లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎ.ఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్ , అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం మొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ గాను.. ఇదే ఏడాదిలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో డీఐజీగా పదోన్నతి పొందిన అంబర్ కిషోర్ ఝా.. ఇటీవల రాచకొండ జాయింట్ సీపీ గా నియమించబడ్డారు.

ఇది కూడా చదవండి: 60 ఏండ్లలో కాంగ్రెస్‌ చేయని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే చేశాం

Latest News

More Articles