Tuesday, May 21, 2024

‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్’గా పాట్‌ కమిన్స్‌

spot_img

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డు విజేతగా ఎంపికయ్యాడు. కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లను వెనక్కినెట్టి అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులోనూ కమిన్స్‌ ఉన్నాడు.

Also Read.. శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదు. స‌ర్వేకు సుప్రీం నో!

కమిన్స్ గతేడాది అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో ఘనతలను నమోదు చేశాడు. డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తో ఆసీస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా ఘనత సాధించాడు. యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేసింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) సాధించింది. ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కమిన్స్ విజయం సాధించాడు.

Also Read.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది

ప్రపంచకప్‌లో సత్తా చాటిన కమిన్స్‌ ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కమిన్స్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడి.. 45 వికెట్లు తీశాడు.

Latest News

More Articles