Wednesday, May 22, 2024

దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి

spot_img

షెడ్యూల్ కులాల వర్గీకరణ గురించి మాదిగ దండోరా గత 30 ఏండ్లుగా పోరాటం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.హనుమకోండ జిల్లా హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కడియం. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ ఆమోదం పొందింది. సుప్రీంకోర్టు జనవరి 17 నుండి వర్గీకరణ కేసు వాదనలు చేయాల్సి ఉంది… కానీ కొన్ని కారణాలతో వాదన వాయిదా పడింది. నేను వర్గీకరణను ఏకీభవిస్తున్న.ఎస్సీ వర్గీకరణ బీజేపీ పార్టీ అమలు చేస్తుందని నమ్మకం లేదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలి. బీజేపీ ప్రాతిపదికన రిజర్వేషన్ అడగడం సమంజసం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలి. మంచి అడ్వాకేట్ ను పెట్టి బలంగా వాదించాలన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకం అమలు చేశారని తెలిపారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో 1100 మంది దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారుల అకౌంట్ లను ఫీజ్ చేసింది.. ఫీజ్ చేసిన అకౌంట్లను వెంటనే ఆన్ ఫీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ప్రతి లబ్దిదారునికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిందన్న ఎమ్మెల్యే కడియం..దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా.. అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని కొనసాగిస్తుందో లేదో చెప్పాలన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ టీకా కోర్బీవ్యాక్స్ కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

Latest News

More Articles