Thursday, May 9, 2024

హైదరాబాద్ టీకా కోర్బీవ్యాక్స్ కు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

spot_img

హైద‌రాబాద్‌ కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ స్వ‌దేశీయంగా త‌యారు చేసిన కోర్బీవ్యాక్స్ కోవిడ్ టీకాకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చింది. ప్రోటీన్ స‌బ్ యూనిట్ ఫ్లాట్‌ ఫామ్‌పై స్వ‌దేశీయంగా త‌యారైన తొలి దేశీ కరోనా వ్యాక్సిన్ ఇదే. కోర్బీవ్యాక్స్ టీకాను అత్య‌వ‌స‌రం వినియోగం కింద ఇవ్వ‌వ‌చ్చు అని డ‌బ్ల్యూహెచ్‌వో  చెప్పింది. కోర్బీవ్యాక్స్ కు ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు వంద మిలియ‌న్ల కోర్బీవ్యాక్స్ కోవిడ్ టీకాల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ అంద‌జేసింది. ఈ టీకాను ఎక్కువ‌గా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు ఉపయోగించారు.

త‌మ వ్యాక్సిన్‌కు డ‌బ్ల్యూహెచ్ ఎమ‌ర్జెన్సీ లిస్టింగ్ రావ‌డం సంతోషంగా ఉందన్నారు బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌హిమ ధాట్ల. డ‌బ్ల్యూహెచ్‌వో లిస్టింగ్‌తో త‌మ కంపెనీ కోవిడ్ 19 టీకాల త‌యారీ వేగాన్ని పెంచ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా నియంత్ర‌ణ కోసం జ‌రుగుతున్న పోరాటానికి త‌మ వంతు సాయం అందిస్తున్నామ‌న్న విశ్వాసం పెరిగిందన్నారు. చాలా వ‌ర‌కు దేశాలు కోవిడ్‌ను ఎదుర్కోవ‌డంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయ‌ని, అలాంటి ప్ర‌జ‌ల‌కు త‌మ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. అంద‌రికీ అందే రీతిలో, నాణ్య‌మైన టీకాను అందించ‌డం త‌మ ఉద్దేశం అని, డ‌బ్ల్యూహెవో అనుమ‌తి ద‌క్క‌డం ఆ మార్గాన్ని ఈజీ చేస్తుంద‌న్నారు మ‌హిమ.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది

Latest News

More Articles