Saturday, April 27, 2024

శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదు. స‌ర్వేకు సుప్రీం నో!

spot_img

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న షాహి ఈద్గా మ‌సీదులో స‌ర్వే చేసేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇవ్వలేదు. అంతకుముందు స‌ర్వే కోసం క‌మీష‌న‌ర్‌ను నియ‌మించాల‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై స్టే విధించింది.

Also Read.. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌!

శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ల‌క్నోకు చెందిన అడ్వ‌కేట్ రంజ‌నా అగ్నిహోత్రి సుప్రీంకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. 13.37 ఎకరాల వివాదాస్ప‌ద స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు పిటిషన్ లో ఆరోపించారు. గతంలో ఆ ప్రదేశంలో క‌ట్రా కేశ‌వ్ దేవ్ ఆల‌యం ఉన్న‌దని, ఈ స్థ‌లంలోనే కృష్ణుడు జ‌న్మించిన చెర‌శాల ఉన్న‌ట్లు పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

Latest News

More Articles