Saturday, April 27, 2024

విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌!

spot_img

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు రిఫర్ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Also Read.. పంజాబ్ సీఎంను చంపుతామంటూ గ్యాంగ్‎స్టర్ హెచ్చరిక

చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని, సీఐడీ తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ అభిప్రాయపడ్డారు. అయితే, 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్‌ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం. త్రివేది అన్నారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్‌ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ తమ వాదనలు వినిపించారు.

Latest News

More Articles