Thursday, May 9, 2024

గులాబీ జెండా గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చింది

spot_img

ఒక్కడితో మొదలైన బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్‌ చైతన్యపరిచారని తెలిపారు. అంగబలం, అర్ధబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ వాదాన్ని అణిచవేయాలన్న ప్రతిసారి ఉద్యమం మరింత ఉధృతం చేశారన్నారు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చపెట్టి తెలంగాణ వాదాన్ని గెలిపించారన్నారు. జలదృశ్యం నుంచి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అణచివేతలు, అనుమానాలు ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ గొంతుకై.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం

23 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్‌ ఎన్నడూ ఎత్తిన జెండా దించలేదని, పట్టిన పట్టును విడువలేదని చెప్పారు. గులాబీ జెండానే గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టిందని తెలిపారు హరీశ్ రావు. పదేండ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందన్నారు. ఈ ఘనత ముమ్మాటికీ గులాబీ జెండాదేనని చెప్పారు. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి అని చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడల్లా ధిక్కార స్వరమై నిలిచిందన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు హరీశ్ రావు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన పోరాటం చేసిందని చెప్పారు. ఇప్పుడు మరోసారి ప్రజలకోసం ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్‌ఎస్‌ సంసిద్ధమైందన్నారు.

Latest News

More Articles