Wednesday, June 26, 2024

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‎కు బాంబ్ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..

spot_img

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‎కు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఆల్ఫా హోటల్‎లో బాంబులు పెట్టే విషయమై కొంతమంది చర్చిస్తున్నారని.. ఆ వ్యక్తులను చూపిస్తానంటూ గౌస్ పాషా అనే వ్యక్తి 100కు కాల్ చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకొని, గౌస్ పాషాకు ఫోన్ చేయగా అతని ఫోన్ కలవలేదు. దాంతో బాంబు, డాగ్ స్క్వాడ్‎తో ఆల్ఫా హోటల్ మొత్తం తనిఖీలు చేశారు. చివరికి హోటల్లో బాంబు లేదని తేల్చిన పోలీసులు.. ఫేక్ కాల్‏గా నిర్ధారించారు. ఫోన్ చేసిన గౌస్ పాషాను ఫోన్ కాల్ ఆధారంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

Read Also: విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. ఇకపై స్పాన్సర్‎షిప్ కష్టమే

Latest News

More Articles