Saturday, May 4, 2024

రైతుబంధు పంపిణీకి అనుమతివ్వాలంటూ మరోసారి ఈసీకి బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తి

spot_img

రైత బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌రిగే న‌గ‌దు బ‌దిలీని ఎన్నిక‌ల సంఘం నిలిపివేసింది. దీంతో మరోసారి రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) లేఖ రాసింది.

యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి ఈసీ ఇటీవలే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే అనూహ్యంగా ఇవాళ(సోమవారం) ఆ అనుమతుల్ని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి ఈసీని ఆశ్రయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అనుమతిని నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.

ఈ విషయంలో విపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేశాయని తెలిపింది బీఆర్ఎస్ పార్టీ. మంత్రి హరీశ్‌ రావు ఈ పథకాన్ని ప్రచారం చేయలేదని.. అనుమతి మంజూరు చేసినందుకు ఈసీకి కృతజ్ఞతలు మాత్రమే తెలిపారని వివరించింది. దీన్ని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించలేమని బీఆర్‌ఎస్‌ పార్టీ తన లేఖలో తెలిపింది.

ఇది కూడా చదవండి: రైతుబంధు ఆపిన కాంగ్రెస్‏ను ఖతం చేయాలి

Latest News

More Articles