Friday, May 3, 2024

వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా?

spot_img

వర్షాకాలంలో తీసుకునే ఆహారాల విజయంలో జాగ్రత్తగా ఉండాలి.  అయితే, వర్షా కాలంలో అరటిపండ్లను తినడం మంచిదేనా? అన్న సందేహం ఉంటుంది. అసలు వర్షాకాలంలో అరటిపండ్లను తినవచ్చా? లేదా అనేది తెలుసుకుందాం.

అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటుంది.ఇది శరీరానికి అవసరమైన శక్తి అందిస్తుంది. ఇక ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం అనేవి దరిచేరవు. అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును నియంత్రణ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

benefits of bananas-Tnews telugu

ఈ వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువ. తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వక కడుపులో మంట, కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతుంది. అరటి పండ్లలో పెక్టిన్ అనే పైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుచుతుంది.

అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. వీటి కారణంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎన్నో పోషకాలు ఉండే అరటిపండును ప్రతి రోజు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఒక అరటిపండును తినవచ్చు.

benefits of bananas-Tnews telugu

అరటిపండు అందాన్ని మెరుగు పరుస్తుంది. బనానా పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే జుట్టుకు కూడా మంచి పోషణ అందిస్తుంది.  ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆహారం అరిగేందుకు ఈ పండ్లను తినిపిస్తారు. ఈ పండుతో దంత సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లను అన్ని సీజన్లలో మితంగా తినవచ్చని న్యూట్రిషియన్స్ చెప్పారు.

Latest News

More Articles