Sunday, May 19, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

spot_img

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 119 అసెంబ్లీ స్థానాలలో పోటీలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో 3కోట్ల 26లక్షల 2వేల 799మంది ఓటర్లు ఉన్నారు.

Also Read.. బ్రాండ్ హైద‌రాబాద్.. కేటీఆర్ కి ప్రశంసలు

దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21వేల,686 వీల్ ఛైర్లను అధికారులు సిద్ధం చేశారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించినట్లు తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు.

Also Read.. ఓటు వేయాలంటే.. ఈ కార్డుల్లో ఒక్కటి ఉండాల్సిందే!

పోలింగ్ ప్రక్రియలో 1.85 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉంటారు. 375 కేంద్ర కంపెనీల కేంద్ర బలగాలకు తోడు 65 వేల మంది రాష్ట్ర పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు.

Also Read.. మీ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి

Latest News

More Articles