Friday, May 17, 2024

ఓటు వేయాలంటే.. ఈ కార్డుల్లో ఒక్కటి ఉండాల్సిందే!

spot_img

హైదరాబాద్: గురువారం (నవంబర్ 30) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్పుతోపాటు ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ ఐడీ కార్డు ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడీ కార్డు లేకున్నా ఫర్వాలేదని, ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులను ఉపయోగించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

Also Read.. మీ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి

ఫొటో ఓటరు స్లిప్పు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌), ఆధార్‌ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జారీ చేసిన జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వీటిల్లో ఏదైనా గుర్తింపు పత్రంగా చూపి ఓటు హక్కను వినియోగించుకోవచ్చు.

Latest News

More Articles