Sunday, May 5, 2024

వార్ వన్ సైడే.. ఏకమైన ఆటో డ్రైవ‌ర్లు

spot_img

కంప‌ల్స‌రీ కేసీఆర్‌ను గెలిపించుకుంటామ‌ని ఆటో డ్రైవ‌ర్లు చెబుతున్నారు. కారుకే మా ఓటు అని తేల్చ‌చెబుతున్నారు. కేసీఆర్ ప‌రిపాల‌న‌లోనే ఆటో డ్రైవ‌ర్ల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌ని, సంపాదించిన డ‌బ్బుల‌తో కుటుంబంతో సంతోషంగా ఉంటున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రం ఎంతో అభివృద్ధి చెందింద‌ని, ప‌ర్యాట‌కంగా తీర్చిదిద్ద‌డంతో, త‌మ‌కు ఉపాధి దొరికింద‌ని ఆటో డ్రైవ‌ర్లు పేర్కొన్నారు.

ఆటో డ్రైవ‌ర్ల‌కు యూనియ‌న్ కార్డులు ఇచ్చారు. 5 ల‌క్ష‌ల బీమా క‌ల్పించారు. కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్లో బీమా లేదు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మాఫీ చేశారు. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఫిట్‌నెస్ ట్యాక్స్ ర‌ద్దు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. తొమ్మిదేండ్ల పాల‌న‌లో ఆటో డ్రైవ‌ర్ల‌కు ఎంతో మంచి చేశారు. కేసీఆర్‌ను గెలిపించుకుంటాం. ఇప్పుడు ఆటో డ్రైవ‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.

Latest News

More Articles