Tuesday, April 30, 2024

శవయాత్రా జైత్రయాత్రా.. నవంబర్‌ 29 ప్రాముఖ్యత ఇదే

spot_img

కేసీఆర్‌ చావు అంచుల దాక వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. నవంబర్‌ 29 దీక్షా దివాస్‌ అనేది ఒక చారిత్రాత్మక రోజని, కేసీఆర్‌ ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నివాదంతో దీక్షను చేపట్టిన రోజని హరీశ్‌రావు అన్నారు. బుధవారం నవంబర్‌ 29 దీక్షా దివాస్‌ను పురస్కరించుకోని సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించి అమరులను స్మరించుకున్నారు.

అనంతరం మంత్రి నివాసంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దీక్షకు వెళ్లేటప్పుడు నా శవయాత్ర లేదా తెలంగాణ జైత్రయాత్రని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు నవంబర్‌ 29 అన్నారు. ఈ దీక్షకు సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వేదిక అయ్యిందన్నారు. కేసీఆర్‌ చేపట్టిన దీక్ష యావత్తు తెలంగాణ సమాజాన్ని కదిలించిందన్నారు. పోరాట ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు తెలిపారు.

Latest News

More Articles