Saturday, May 18, 2024

సుప్రీంకోర్టుకు చేరిన చంద్రబాబు కేసు

spot_img

స్కిల్ డెవలప్‎మెంట్ స్కామ్‎లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఆయన అరెస్టుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, హైకోర్టు ఆ పిటిషన్‎ను కొట్టి వేసింది. అంతేకాకుండా చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని క్వాష్ పిటిషన్‎లో న్యాయవాదులు పేర్కొన్నారు.

Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై బీజేపీ నాయకుల దాడి

కాగా.. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురు అయింది. ఆయనను సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ను
విచారించేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం 2 గంటలకు తిరిగి విచారణ ప్రారంభం అవుతుంది.

Read Also: వినాయకుడి చందా విషయంలో గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి

Latest News

More Articles