Friday, May 17, 2024

రూ. 50 వేలు మించి న‌గ‌దు ఉంటే సీజ్ చేస్తాం

spot_img

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలు పాటించాలని భ‌వ‌న‌గిరి యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జెండగె హన్మంతు కొండిబా తెలిపారు.ఇవాళ(శనివారం) గ్రీవెన్సీ కమిటీలో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారము ఎవరు కూడా రూ. 50 వేల కన్నా ఎక్కువ నగదును తమ దగ్గర ఉంచుకొని జర్నీ చేయవద్దని తెలిపారు. జిల్లాలో పోలీసు ఎఫ్.ఎస్.టి. బృందాలు తనిఖీలలో స్వాధీనం చేసుకున్న రూ. 50 వేలకు మించి నగదు, ఇతర వస్తువులను పరిశీలించి విడుదల చేసేందుకు “జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ” ఏర్పాటు చేసినట్ల తెలిపారు. విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి కార్యాలయములో గ్రీవెన్స్ కమిటీ పరిశీలిస్తుందని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో జిల్లా సహకార అధికారి కార్యాలయం ఉందని తెలిపారు.

ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తెసుకెళ్లవద్దని, అలా దొరికిన నగదును సీజ్ చేసి డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధం లేదని సరైన ఆధారాలు చూపితే తిరిగి ఇచ్చేస్తారని, అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తీసుకెళ్ళేవాళ్ళు సరైన పేపర్లతో నగదును తీసుకెళ్లాలని సూచించారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు చేసుకొనుటకు సరైన ఆధారాలతో ధరఖాస్తు చేసుకోవడానికి గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీనివాస రావు సెల్ నెంబర్ 9100115660 సంప్రదించాలని తెలిపారు కలెక్టర్ హన్మంతు కొండిబా.

ఇది కూడా చదవండి: మేడ్చల్ లో భారీగా నగదు పట్టివేత

Latest News

More Articles