Friday, May 3, 2024

గణేషుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా?

spot_img

దేశవ్యాప్తంగా వినాయక చవితిని చాలా వైభవంగా జరుపుకుంటారు. 9 రోజులు ఘనంగా నిత్య పూజలు చేసి.. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే చాలామందికి వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలియదు. సాధారణంగా వినాయకచవితి భాద్రపదమాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవడం వల్ల నదులు, కాలువలు, చెరువులు.. పొంగి పొర్లుతుంటాయి. ఇలా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల భూమి అంతా కొట్టుకోపోతుంది. దాంతో అక్కడి భూమిలో భూసారం లేకుండా పోతుంది. అయితే వినాయకుని ప్రతిమలని నిమజ్జనం చేయడం వల్ల సారవంతమైన మట్టి తిరిగి చెరువులు, కాలువల్లో చేరుతుంది.

Read Also: బాలాపూర్ లడ్డూ తొలి వేలం కేవలం రూ.450.. 30ఏళ్లుగా ఎవరెవరు దక్కించుకున్నారంటే?

అదేవిధంగా వినాయకున్ని ఆకులు, పువ్వులు, పసుపు కుంకమలతో పూజిస్తారు. వాటన్నింటిని కూడా నీటిలో కలుపుతారు. వినాయకుడి పూజలో వాడే ఆకులకు ఆయుర్వేద గుణాలు ఉంటాయి. దాంతో వాటిని నీటిలో కలపడం వల్ల నీటిలోని సూక్ష్మ క్రిములు నశించి నీరు స్వచ్ఛంగా మారుతుంది. అప్పుడు ఆ నీటిని వాడుకున్నా అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలానే వర్షాకాలంలో మనుషుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పండుగ రోజుల్లో ఎక్కువగా ఆవిరిపై ఉడికించిన పౌష్ఠిక విలువులున్న ఆహార పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

Latest News

More Articles