Friday, May 3, 2024

నల్గొండ జిల్లాకు ఉరి వేశారు.. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ ఫైర్

spot_img

యాదాద్రి జిల్లా: కేఆర్ఎంబీ (KRMB)కి సాగునీటి ప్రాజెక్టులను అప్పజెప్పి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ వాళ్లు ఉరి వేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేవంత్ సర్కార్ నిర్లజ్జగా సాగు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల  సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘‘రాష్ట్రంలోబీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్(BRS) కే ఉంది. ఆదానినీ కౌగిలించుకున్నది కాంగ్రెస్ వాళ్లు కాదా. బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే గవర్నర్ అడ్డుకున్నారు. అదే కాంగ్రెస్ పంపిస్తే మాత్రం ఆమోదించారు. రూ. 3. 87 లక్షల కోట్లు అప్పు అయితే రూ. 6 లక్షల కోట్లు అప్పు అని దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో అమలు చేయడం లేదు. నర్సుల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ  ఇచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు. కానీ మాట తప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆడిగితే నోటికొచ్చినట్లు తిడుతున్నారు.  రుణమాఫీ ఏమైంది? సకాలంలో పెన్షన్ లు ఇస్తాలేరు. వృద్ధులు రొడ్డు ఎక్కుతున్నారు.

24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందని ప్రజలు అనుకుంటున్నారు. అన్ని విషయాల్లో మోసం చేసింది కాంగ్రెస్. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో 420 హామీలను ఇచ్చారు. దళిత బంధు డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. దళితులను మోసం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిపై గులాబీ జెండా ఎగరేస్తాం. కార్యకర్తలు పట్టుబట్టాలి. మనము కూడా రామ భక్తులమే. బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. అన్నిట్లో మొండి చెయ్యి చూపించింది బీజేపీ. తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ హక్కుల కోసమే బీఆర్ఎస్ పోరాటం.’’ అని అన్నారు.

Also Read.. మంకీ ఫీవర్ కలకలం.. భారీగా కేసులు.. అడవుల్లోకి ఎవ్వరు వెళ్ళొదంటూ ఆదేశాలు

Latest News

More Articles