Tuesday, May 7, 2024

మంకీ ఫీవర్ కలకలం.. భారీగా కేసులు.. అడవుల్లోకి ఎవ్వరు వెళ్ళొదంటూ ఆదేశాలు

spot_img

కర్ణాటకలోని ఉత్తర జిల్లాలో ఇప్పటివరకు కనీసం 21 మందికి మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు. మంకీ ఫీవర్ తో బాధపడుతున్న 21 మందిలో ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చేరగా, 13 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే మరింత వ్యాధి ప్రబలకుండా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD)ని సాధారణంగా మంకీ ఫీవర్ అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో ప్రబలిన వ్యాధి. ఈ వైరస్ ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే ఉండటంతో అడవుల్లో మరియు చుట్టుపక్కల నివసించే ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల మంకీ ఫీవర్ వస్తుంది. ఇది కోతుల ద్వారా వ్యాపించే వ్యాధి. ఎల్లో ఫీవర్, డెంగ్యూకు కారణమయ్యే అదే వైరస్ కుటుంబానికి చెందుతుంది. ఇక వైరస్ ప్రభావం తగ్గేవరకూ అడవుల్లోకి వెళ్లవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు జిల్లా ఆరోగ్య అధికారి (డిహెచ్‌ఓ) డాక్టర్ నిరజ్.

Latest News

More Articles